Yadamma Yadammo Lyrics – Mangli, Nalgonda Gaddar Narasanna
Singer | Mangli, Nalgonda Gaddar Narasanna |
Composer | Charan Arjun |
Music | Charan Arjun |
Song Writer | Charan Arjun |
Lyrics
Yadamma Yadammo Song Lyrics in Telugu
మేరానామ్ యాదమ్మ
నే నే మెహర్బాని చూడనమ్మ
యాదమ్మ యాదమ్మో యాదమ్మో
ఆకులోర యాదమ్మో
కుక్కురు కుక్కురు కుక్కురు కుక్కురు
నీతోడు నీకుంటే ధన్యుండునే యాదమ్మ
కుక్కురు కుక్కురు కుక్కురు కుక్కురు
గలుమల కూసుంటే పిల్లో
ఎంత గమ్ముతుండునే
ఒంటిగ నువ్వుంటే ఊళ్ళో
కళ్లన్నీ నీ మీదనే
అయినోడు కానోడు ఆశ పడుతడే
నిన్నే చూస్తే పసిపోరడైన ఆగమైతడే
ఆ సందు ఈ సందు ఎటు సూడు సందడే
పిల్లో నీ అందం చూస్తే గుటకల్లు మింగుడే
యాదమ్మో… యాదమ్మో
యాదమ్మో యాదమ్మో
నువు అలగు పీసే యాదమ్మ
నీ ఫిగరు చూసి ఫిదా అయ్
పిచ్చోలైనం యాదమ్మ…
ఏందయ్ ఏందయ్యో
ఏందయ్యో నీ ఎతులేందయ్యో
నా సోయి నాకుంది సీనయ్యో
నీ సోది ఆపయ్యో
నా పెళ్లి జెయ్యంగా
ఇంట్లో పెద్దలు ఉన్నారు
మా సుట్ట పక్కలా రోజూ
అడుగుతు ఉన్నారు
నీ ముల్లేం పోతుంది నా పెండ్లి ఆగితే
పోయి కల్లెంలో పడ్తవ్ రెండు పీకితే
పనిపాట లేనోళ్లంతా ప్రశ్నలడిగితే
నేను జెప్పను జర తెలుసుకో
యాదమ్మ సంగతే…
ఏడాదికోసారి యాదమ్మో
లోకాన జాగారం యాదమ్మ
మన ఊళ్లే నీకోసం యాదమ్మో
రోజూ జాగారం యాదమ్మ
ఒంటిగ నీకెట్టా నైటు నిద్దర పట్టేను
పోరడు ఆగం అయ్యేను
నువ్వు కనబడని రోజు
ఊరు సిమ్మసీకటే
అన్నం నీళ్ళున్నా అందరికి
ఏదో కటకటే…
యాదమ్మో యాదమ్మో
నువు అలగు పీసే యాదమ్మ
నీ ఫిగరు చూసి ఫిదా అయ్
పిచ్చోలైనం యాదమ్మ…
నీ అయ్యక్కే లేదు
నీకందాల సుందరి కావాలా
మింగమెతుకు లేదు
మీసాలకు సంపంగి నూనేలా
నిద్దర రాకుంటే అది గత్తర జబ్బేమో
ఆర్.ఎం.పి సారు వస్తడు
మందులు వాడమను
ఏ పిల్లా ఎంటపడితే
అస్సలు పడదురో
నీ టాలెంటు సూపి
ప్రేమలోన దింపరో
యాదమ్మ భూమి పైన అలగు పీసురో
ఉత్త మాటలతో ఊదుకోదు ఊరమాసురో
నీ ఇంటి ముందర యాదమ్మో
రోజంతా దండోరా యాదమ్మ
ఎమ్మెల్యేలకన్నా ఎక్కువ
నీ ఎనక సాగేనే జాతరా
పెండ్లి కానోళ్ళకు పిల్లో నువ్వే కావాలే
పెళ్ళైపోయినోళ్ళు ఉన్నదంతా నీకిచ్చి ఏలాలే
శ్రీదేవి సౌందర్య రోజులప్పుడూ
ఏది ఏమైనా యాదమ్మ రోజులిప్పుడు
పైపైన అందాలు ఓరయ్యో
పది రోజులాటేరో
నా ఇల్లు నా గుణము సూడాలే
ఉండొద్దు తేడాలే
అయ్యేది ఎట్టాగైనా ఐతదంటనే పిల్లా
మడిసంటే ఉండాలంట కళాపోషణే
ఎడ్డోని ముందు నేనేం రాగం తీద్ధునే
ఎడ్డెం అంటేను తెడ్డెం అంటే నేనేం జేద్దునే
యాదమ్మో, యెహే… యాదమ్మో, ఓ పిల్ల
యాదమ్మో యాదమ్మో
నువు అలగు పీసే యాదమ్మ
నీ ఫిగరు చూసి ఫిదా అయ్
పిచ్చోలైనం యాదమ్మ… ఆ
చల్ పోరా బయ్…..